భారతదేశం, జూన్ 16 -- 2026 సంవత్సరానికి హెచ్-1బీ వీసా క్యాప్ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) తాజా డేటా ప్రకారం ఈసారి కేవలం 3.58 లక్షల దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇది గత సంవత్సరం 4.78 లక్షలతో పోలిస్తే 26.9 శాతం తగ్గుదల అన్నమాట. 2024తో పోలిస్తే ఈ సంఖ్య 54 శాతానికి పైగా తగ్గింది.

ఈ ఏడాది మొత్తం రిజిస్ట్రేషన్లలో 1,20,141 రిజిస్ట్రేషన్లు జరిగాయి. హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ భారతీయ ఐటీ ఉద్యోగులకు ముఖ్యమైనది, యూఎస్ టెక్ కంపెనీలు ప్రతిభావంతులను నియమించుకోవడానికి ఇది ప్రధాన మార్గంగా చూస్తాయి. ప్రతి సంవత్సరం ఈ ప్రోగ్రామ్ 85,000 వీసాలను ఇస్తుంది. ఇందులో యూఎస్ మాస్టర్స్ డిగ్రీలు ఉన్నవారికి 20,000 సీట్లు ఉన్నాయి.

కొత్త నిబంధనలు, అధిక హెచ్-1బీ ఖర్చులు, విదేశీ ఉద్యోగుల కెరీర్ ప్రణాళికలను ...