భారతదేశం, నవంబర్ 13 -- అమెరికా వీసా కార్యక్రమాలను కొనసాగించే విషయంలో ట్రంప్ ప్రభుత్వం వైఖరిని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోమ్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.

నోమ్ మాట్లాడుతూ, "మేము వీసా కార్యక్రమాలను కచ్చితంగా కొనసాగిస్తాం. అయితే, వాటిలో నిజాయితీ, పటిష్టత ఉండేలా చూస్తాం. దేశంలోకి వచ్చే వ్యక్తులను సరిగ్గా తనిఖీ చేస్తాం. వారు సరైన కారణాల కోసం ఇక్కడికి రావాలనుకుంటున్నారని, టెర్రరిస్టులకు లేదా అమెరికాను ద్వేషించే సంస్థలకు మద్దతుదారులు కాదని నిర్ధారించుకుంటాం" అని తెలిపారు.

ట్రంప్ ఇటీవలి వ్యాఖ్యల నేపథ్యంలో హెచ్-1బీ వీసాలపై ప్రభుత్వ వైఖరి ఏమిటని అడిగిన ప్రశ్నకు నోమ్ స్పందిస్తూ.. "ట్రంప్ ప్రభుత్వం హయాంలో, మేము వీసా కార్యక్రమాలు, గ్రీన్ కార్డ్‌ల ప్రక్రియను వేగవంతం చేసి, పటిష్టతను జోడించాం. దీని ఫలితంగా మునుపెన్నడూ...