భారతదేశం, డిసెంబర్ 24 -- ఇప్పటివరకు అమెరికా ప్రభుత్వం ప్రతి సంవత్సరం వచ్చే లక్షలాది దరఖాస్తుల నుండి కంప్యూటర్ ఆధారిత లాటరీ ద్వారా అదృష్టవంతులను ఎంపిక చేసేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం, ఈ లాటరీ స్థానంలో 'వెయిటెడ్ సెలక్షన్ ప్రాసెస్' (Weighted Selection Process) అమలులోకి వస్తుంది. ఈ విధానంలో ఒక దరఖాస్తుదారుడికి ఇచ్చే వేతనం (Salary), అతని నైపుణ్యం (Skill) ఆధారంగా వీసా లభించే అవకాశాలు మారుతాయి.

ప్రభుత్వం ఉద్యోగాలను వాటి వేతన స్థాయిని బట్టి నాలుగు కేటగిరీలుగా విభజించింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులకు ఎంపికయ్యే అవకాశాలు ఈ కింది విధంగా ఉంటాయి:

పూర్తి స్థాయి నైపుణ్యం కలిగిన సీనియర్ ఉద్యోగులకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. వీరి దరఖాస్తులను ఎంపిక ప్రక్రియలో నాలుగు సార్లు (4 entries) పరిగణనలోకి తీసుకుంటారు. అంటే వీరికి వీసా లభించే అవకాశం ...