భారతదేశం, జనవరి 12 -- దేశీయ ఐటీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటిగా ఉన్న హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Tech), ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసిక ఫలితాలను సోమవారం ప్రకటించింది. కంపెనీ నికర లాభం గతేడాదితో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ, ఆదాయం (Revenue) పెరగడం గమనార్హం. ఇదే సమయంలో తన వాటాదారులకు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించి కంపెనీ తీపి కబురు అందించింది.

హెచ్‌సీఎల్ టెక్ బోర్డు ఒక్కో ఈక్విటీ షేరుపై రూ.12 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.

రికార్డు తేదీ: జనవరి 16, 2026

చెల్లింపు తేదీ: జనవరి 27, 2026 గత ఏడాది కాలంలో హెచ్‌సీఎల్ టెక్ మొత్తం Rs.60 డివిడెండ్‌ను అందించింది. దీంతో కంపెనీ డివిడెండ్ యీల్డ్ 3.60 శాతంగా ఉంది.

డిసెంబర్ త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం 11.14 శాతం తగ్గి Rs.4,076 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో క...