భారతదేశం, జూన్ 30 -- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు బలమైన డిమాండ్ కనిపించింది. ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ జూన్ 25న ప్రారంభమై జూన్ 27తో ముగిసింది. ఇప్పుడు, పెట్టుబడిదారుల దృష్టి హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ తేదీపై పడింది. ఇది నేడు, జూన్ 30న అలాట్​మెంట్​ స్టేటస్​ లైవ్​ అయ్యే అవకాశం ఉంది. అలాగే, జులై 2న ఐపీఓ లిస్టింగ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కంపెనీ త్వరలోనే హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఖరారు చేయనుంది. అలాట్‌మెంట్ ఖరారైన తర్వాత, అర్హత కలిగిన అలాట్‌మెంట్ హోల్డర్ల డీమ్యాట్ ఖాతాలకు షేర్లను జమ చేస్తుంది. అదే రోజున, షేర్లు రాని వారికి రీఫండ్‌లను కూడా ప్రారంభిస్తుంది.

హెచ్‌డీబీ ఫైనాన్...