భారతదేశం, నవంబర్ 21 -- హెచ్‌ఐఎల్‌టీపీ విధానం పేరిట దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నారని కేటీఆర్ ఆరోపించారు. అది పాలసీ కాదని. రూ. 5 లక్షల కోట్ల స్కామ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన. లక్షల కోట్ల విలువైన భూమిని అప్పనంగా ప్రవేట్ వ్యక్తులకు అప్పచెబుతోందన్నారు. వెంటనే ప్రభుత్వం ఈ పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ ముసుగులో, రేవంత్ రెడ్డి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ విమర్శించారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్‌నగర్, అజామాబాద్‌తో సహా హైదరాబాద్‌లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్‌లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.

ఈ భూముల మార్కెట్ విలువ ప్రస...