భారతదేశం, జూన్ 11 -- ఇతర భాషల్లో సూపర్ హిట్లుగా నిలిచిన సినిమాలు తెలుగులోకి రీమేక్ కావడం, డబ్ అవడం కామనే. కానీ 2023లో తమిళంలో వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ రొమాంటిక్ యూత్ ఫ్యామిలీ డ్రామా సినిమా ఇప్పుడు తెలుగులో థియేటర్లకు రాబోతోంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత బిగ్ స్క్రీన్ పైకి సినిమా వస్తుండటం గమనార్హం.

2023లో వచ్చిన తమిళ్ సినిమా 'దాదా' సూపర్ హిట్ గా నిలిచింది. రొమాంటిక్ కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ తమిళంలో సూపర్ హిట్ గా నిలిచింది. కెవిన్, అపర్ణా దాస్ ఈ మూవీలో లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో 'పాపా' పేరుతో డబ్ కానుంది. జూన్ 13న తెలుగులో థియేటర్లలో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా.

లాస్ట్ ఇయర్ కాలేజీ స్టూడెంట్స్ మణికందన్ (కెవిన్), సింధు (అపర్ణా దాస్) రిలేషన్ షిప్ లో ఉంటారు. డేటింగ్ చేస్త...