Hyderabad, మే 2 -- కింగ్డమ్ (Kingdom) మూవీ నుంచి వచ్చిన హృదయం లోపల సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ సింగిల్ వినగానే ఆకట్టుకునేలా సాగింది. అనిరుధ్ మ్యూజిక్ కంపోజ్ చేయడంతోపాటు స్వయంగా పాడాడు. రానున్న రోజుల్లో ఈ సాంగ్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేసేలా ఉంది.

విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటించిన మూవీ కింగ్డమ్. మే 30న థియేటర్లలో రిలీజ్ కానుంది. టీజర్ తోనే మూవీపై అంచనాలు భారీగా పెరగగా.. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ సింగిల్ హృదయం లోపల వాటిని మరో లెవెల్ కు తీసుకెళ్లింది.

ఈ పాటను అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశాడు. అతడే అనుమిత నదేశన్ తో కలిసి పాడాడు. ఈ పాటను కృష్ణకాంత్ రాశాడు. మరి ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ ఇస్తున్నాం. మీరూ పాడటానికి ట్రై చేయండి.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య...