భారతదేశం, జనవరి 10 -- ఇండియన్ సినిమా 'గ్రీక్ గాడ్' హృతిక్ రోషన్ శనివారం (జనవరి 10) తన 52వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. వయసు పెరిగే కొద్దీ మరింత అందంగా, ఫిట్‌గా మారుతున్న హృతిక్‌ని చూస్తే.. అతనికి 52 ఏళ్లు అంటే ఎవరూ నమ్మరు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి అతడు నటించిన 'వార్-2' కోసం హృతిక్ మేకోవర్ చూసి చాలా మంది షాక్ తిన్నారు. మరి ఐదు పదుల వయసు దాటినా అతడు ఇంత స్ట్రాంగ్‌గా, సిక్స్ ప్యాక్‌తో మెరవడానికి కారణమేంటి? అతని డైట్, వర్కౌట్ రొటీన్ ఏంటి? ఇక్కడ తెలుసుకోండి.

చాలా మంది మంచి బాడీ షేప్ కోసం జిమ్ కు వెళ్తారు. కానీ దానిని అంత సీరియస్ గా తీసుకోరు. హృతిక్ రోషన్ మాత్రం నిలకడను నమ్ముతాడు. వారానికి కనీసం 5 నుంచి 6 రోజులు కచ్చితంగా వర్కౌట్ చేస్తాడు. తన రోజును 20 నిమిషాల హై-ఇంటెన్సిటీ కార్డియోతో ప్రారంభిస్తాడు. ఇందులో రన్నింగ్, సైక్లింగ్ లేదా ...