Hyderabad, అక్టోబర్ 12 -- తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంటుతమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, హీరోయిన్ మమితా బైజు కలిసి నటించిన లేటెస్ట్ మూవీ డ్యూడ్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. ఇటీవల డ్యూడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్, నటుడు శరత్ కుమార్ కామెంట్స్ చేశారు.

తెలుగులో మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న తమిళ హీరోల్లో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో అలరించిన ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన మరో లేటెస్ట్ మూవీ డ్యూడ్. ఇందులో ప్రదీప్‌కు జోడీగా హీరోయిన్ మమితా బైజు నటించింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డ్యూడ్ సినిమాతో కీర్తిశ్వరన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషించిన డ్యూడ్ మూవీ ట్రైలర్‌...