Hyderabad, సెప్టెంబర్ 28 -- అగ్ర హీరోగా పేరు తెచ్చుకున్న దళపతి విజయ్ ఎన్నో సినిమాలతో అలరించాడు. ఈ మధ్యే విజయ్ రాజకీయ రంగప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అయితే, తన పార్టీ టీవీకే ప్రచారం సందర్భంగా తమిళనాడులోని కరూర్ జిల్లాలో సభ నిర్వహించిన విషయం తెలిసిందే.

కానీ, అనూహ్యంగా టీవీకే పార్టీ నిర్వహించిన ప్రచార సభలో తొక్కిసలాట జరిగడంతో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికిపైగా గాయపడిన వారు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఈ ఘటనపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, తమిళనాడు సీఎం స్టాలిన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు స్పందించారు. తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశా...