భారతదేశం, జూలై 20 -- నువ్వుంటే చాలే.. ఇప్పుడు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పాట ఇది. ఈ లవ్ మెలోడీ సాంగ్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. పోతినేని రామ్ హీరోగా యాక్ట్ చేస్తున్న 'ఆంధ్ర కింగ్ తాలూకా' మూవీ నుంచి రిలీజైన ఈ సాంగ్ ఒక్క రోజులోనే తెగ హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.

ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి శుక్రవారం (జులై 18) రిలీజైన 'నువ్వుంటే చాలే' సాంగ్ అదరగొడుతోంది. ఈ పాటను స్వయంగా హీరో పోతినేని రామ్ రాయడం విశేషం. లిరిసిస్ట్ గా రామ్ డెబ్యూ చేశాడు. అతను రాసిన పదాలు మనసులను హత్తుకుంటున్నాయి. ఈ సాహిత్యానికి అనిరుధ్ రవిచందర్ మ్యాజిక్ వాయిస్ తోడవడంతో పాట్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది.

మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో పోతినేని రామ్, భాగ్యశ్రీ బోర్సే నటిస...