భారతదేశం, జూలై 16 -- టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రవితేజ తండ్రి భూపతి రాజు రాజగోపాల్ మరణించారు. 90 ఏళ్ల ఆయన వయసు సంబంధిత అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. మంగళవారం (జూలై 15) రాత్రి హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో భూపతి రాజు చనిపోయారు. కుటుంబానికి పెద్ద దిక్కు తండ్రి చనిపోవడంతో రవితేజ బాధలో మునిగిపోయారు. ఆయన కుటుంబానికి ఇది తీరని లోటు.

మాస్ మహారాజ్ గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు హీరో రవితేజ. రవితేజ ఈ స్థాయికి చేరడం వెనుక తండ్రి భూపతి రాజు రాజగోపాల్ ప్రోత్సాహం ఉంది. భుజం తట్టి నడిపించిన తండ్రి ఇప్పుడు కన్నుమూయడంతో రవితేజ తీవ్రంగా బాధపడుతున్నారు. భూపతి రాజు ఒకప్పుడు ఫార్మాసిస్ట్ గా పనిచేసేవారు. వీళ్ల సొంత ఊరు ఏపీలోని జగ్గంపేట. భూపతి రాజుకు ముగ్గురు కొడుకులు. రవితేజ పెద్ద కుమారుడు. భరత్ రెండ...