Hyderabad, జూలై 1 -- ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన కన్నడ కామెడీ మూవీ మిస్టర్ రాణి (Mr Rani) ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి వస్తోంది. ఐదు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. హీరో కావాలనుకున్న వాడు హీరోయిన్ అయితే ఎలా ఉంటుందన్న వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

మిస్టర్ రాణి ఓ కన్నడ కామెడీ మూవీ. ఈ ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాను జులై 11 నుంచి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.

ఒరిజినల్ కన్నడ ఆడియోతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం. ఈ సినిమాకు ఐఎండీబీలో 9.9 రేటింగ్ ఉంది. చాలా మంది ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.

మ...