భారతదేశం, మార్చి 28 -- హీరో మోటోకార్ప్ ఎక్స్​పల్స్ 210 ఇటీవల భారత మార్కెట్లోకి ప్రవేశించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోటార్​సైకిల్ లాంచ్​లలో ఇది ఒకటి. తయారీదారు పోర్ట్​ఫోలియోలో ఎక్స్​పల్స్ 200 4వీ స్థానాన్ని ఎక్స్​పల్స్ 210 భర్తీ చేస్తుందని మొదట భావించారు. అయితే, ఎక్స్​పల్స్ 210, ఎక్స్​పల్స్ 200 4వీ ఒకదానితో ఒకటి కలిసి సేల్​లోకి వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండింటిని పోల్చి ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకుందాము..

డిజైన్​ పరంగా, రెండు మోటార్ సైకిళ్లను ఆఫ్-రోడ్ మోటార్ సైకిళ్లుగా రూపొందించారు. కాబట్టి, ముందు భాగంలో వృత్తాకార ఎల్ఈడీ హెడ్​ల్యాంప్, విండ్​స్క్రీన్​, బీక్​ తరహా మడ్​గార్డ్ ఉన్నాయి. రెండు మోటార్ సైకిళ్లలో మస్క్యులర్​ ఇంధన ట్యాంకుతో పాటు సింగిల్ పీస్ సీటు, అప్ స్వెప్డ్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. ఏదేమైనా, కొత్త ఎక్స్​ప...