భారతదేశం, అక్టోబర్ 28 -- సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న బర్నింగ్ టాపిక్ రెమ్యునరేషన్ పై ప్రియమని తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ పారితోషికం ఇవ్వడంపై స్పందించింది. ప్రియమణి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి అనేక భాషల సినిమాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఈ నటి న్యూస్18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేల్ కో స్టార్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకోవడంపై రియాక్టయింది.

ఇంటర్వ్యూలో ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది. రెమ్యునరేషన్ లో పక్షపాతాన్ని ఒప్పుకొంది.

"అది నిజమే. కానీ పర్వాలేదు. మీ మార్కెట్ విలువ ఎంత ఉంటే, మీరు దాన్ని బట్టి రెమ్యునరేషన్ అడగాలి. అంత మీకు లభిస్తుంది అని నేను నమ్ముతా. కొన్నిసార్లు నా పురుష సహనటుడి కంటే నాకు తక్కువ పారితోషికం ఇచ్చారు. ...