భారతదేశం, అక్టోబర్ 8 -- కాంతార చాప్టర్ 1 సక్సెస్ తో జోష్ మీదున్నారు రిషబ్ శెట్టి. అతను తాజాగా తమిళనాడులోని కరూర్లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ర్యాలీలో జరిగిన విషాదకర తొక్కిసలాట గురించి స్పందించారు. ఇది ఒక వ్యక్తి వైఫల్యం కాదని, 'సమష్టి తప్పిదం' అని అభివర్ణించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ భారతీయ సినిమాలో హీరో ఆరాధన సంస్కృతి గురించి రిషబ్ శెట్టి కామెంట్ చేశారు. ఇలాంటి విషాదాలు తరచుగా అభిమానం, సామూహిక ఉన్మాదం మధ్య ఉన్న సరిహద్దులను హైలైట్ చేస్తాయని అన్నారు.

"ఇది సమష్టి తప్పిదం" అని విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) రాజకీయ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటన గురించి అడిగిన ప్రశ్నకు రిషబ్ శెట్టి స్పందించారు. "మనకు ఒక హీరో లేదా అతని పాత్ర నచ్చితే ఆ హీరోను మనం ఆరాధిస్తాం. దానిపై నేను ఎలా కామెంట్ చేయగలను? ఇలాంటి ప్రమాదాలు జరిగి...