భారతదేశం, జనవరి 10 -- తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న బ్యూటి సారా అర్జున్. తెలుగులో చియాన్ విక్రమ్ నాన్న సినిమాతో అందరి మనసుల్లో గుర్తుండిపోయింది. అనంతరం ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు, సైడ్ రోల్స్ చేసిన సారా అర్జున్ ఒక్కసారిగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి అందరిని షేక్ చేసింది.

బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ సినిమాతో హీరోయిన్‌గా డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ సారా అర్జున్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో జోడీ కట్టింది ముద్దుగుమ్మ సారా అర్జున్. దురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సారా అర్జున్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది.

దురంధర్ సినిమాలో ఒక రాజకీయ నాయకుడికి అమాయకపు కూతురిగా నటించి.. తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది సారా. అయితే, ధురంధర్ సినిమా వరల్డ్ వై...