భారతదేశం, జనవరి 29 -- 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో దర్శకుడు యదు వంశీ టాలీవుడ్ ఆడియెన్స్ మీద చెరగని ముద్ర వేశారు. కొత్త వారితో తీసిన ఆ చిత్రం ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక యదు వంశీ తన రెండో ప్రాజెక్ట్ కోసం పనులు ప్రారంభించారు.

ఈ క్రమంలో తన రాబోయే ప్రాజెక్ట్ కోసం ఒక యువ మహిళా నటి (హీరోయిన్) కోసం క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అచ్చ తెలుగు అమ్మాయి కోసం యదు వంశీ అన్వేషిస్తున్నారు. నటన, ప్రతిభ-ఆధారిత ప్రక్రియ ద్వారా తెలుగు సినిమాలోకి ప్రవేశించడానికి ఆశావహులైన నటీమణులకు ఓ సువర్ణ అవకాశాన్ని అందించడం లక్ష్యంగా యదు వంశీ ముందుకు సాగుతున్నారు.

'కమిటీ కుర్రోళ్లు' మూవీతో 15 మంది కొత్త ఆర్టిస్టులు, టాలెంట్ ఉన్న హీరో, హీరోయిన్లు తెరపైకి వచ్చారో అందరికీ తెలిసిందే. విలేజ్, రూటెడ్ కథతో వచ్చిన యదు వంశీ కమిటీ కుర్ర...