భారతదేశం, డిసెంబర్ 23 -- దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. హీరోయిన్ల డ్రెస్ ల గురించి శివాజీ మాటలు కాంట్రవర్సీకి కారణమయ్యాయి. చీరలో అందం ఉందని, సామాన్లు కనబడేలా బట్టలు వేసుకోకూడదని శివాజీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

సోమవారం (డిసెంబర్ 22) రాత్రి దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు యాంకర్, హీరోయిన్ తో సహా అందరూ పద్ధతిగా దుస్తులు ధరించి వచ్చారు. ఈ క్రమంలోనే శివాజీ మాట్లాడుతూ హీరోయిన్ డ్రెస్ లపై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. సామాన్లు అంటూ మాట్లాడారు.

''ఒక విషయం చెబుతున్నా. అమ్మాయిలు, హీరోయిన్లు ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా. ఏం అనుకోవద్దు హీరోయిన్లందరూ, మీరు అనుకున్నా నాకు పోయేదేం లేదు. లైట్ త...