భారతదేశం, జూన్ 14 -- టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ర‌ఘు కుంచే హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. గేదెల రాజు కాకినాడ తాలూకా పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. ర‌ఘు కుంచే బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఇటీవ‌ల అత‌డి ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.ఈ పోస్ట‌ర్‌లో ఇంటెన్స్ లుక్‌లో ర‌ఘు కుంచే క‌నిపిస్తున్నారు. లుంగీ క‌ట్టుకొని సీరియ‌స్‌గా ర‌ఘు కుంచే క‌నిపిస్తున్న పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది.

చూస్తే ఒకటే నిజం చూడకపోతే వంద అనుమానాలు...అనే పాయింట్‌తో డిఫ‌రెంట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా గేదెల రాజు కాకినాడ తాలూకా మూవీని రూపొందిస్తోన్నాడు డైరెక్ట‌ర్ చైత‌న్య మోటూరి. ఓ నిజాన్ని వెలుగులోకి తీసుకురావ‌డానికి గేదెల రాజు ఏం చేశాడ‌న్న‌ది ఈ సినిమాలో థ్రిల్లింగ్‌గా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

గేదెల రాజుగా టైటిల్ పాత్ర‌లో న‌టిస్తూనే ఈ మూవీకి ప్ర‌జెంట‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా...