భారతదేశం, నవంబర్ 1 -- లోకేష్ కగనరాజ్.. ఈ పేరు వింటే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గుర్తుకొస్తాడు. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో, కూలీ లాంటి సూపర్ హిట్లను అందించాడు లోకేష్. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో సంచలనమే క్రియేట్ చేశాడు. అలాంటి డైరెక్టర్ ఇప్పుడు కెప్టెన్ సీట్ వదిలి రంగంలోకి దిగాడు. హీరోగా డెబ్యూ చేయబోతున్నాడు. అతను హీరోగా వస్తున్న సినిమా టైటిల్ ను ఇవాళ (నవంబర్ 1) రిలీజ్ చేశారు.

ఇప్పటివరకూ సాధారణంగా అయితే డైరెక్టర్ గా లోకేష్ కనగరాజ్ మూవీ టైటిల్ ను రివీల్ చేసేవాడు. ఇప్పుడు హీరోగా అతని మూవీ టైటిల్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫుల్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'డీసీ' అనే పేరు పెట్టారు. అంటే ఇందులో హీరో క్యారెక్టర్ పేరు దేవదాస్. హీరోయిన్ క్యారెక్టర్ పేరు చంద్ర. ఈ రెండు పేర్లలోని ఇంగ్లీష్ మొదటి లెటర్స్ కలిపి డీసీ అని పేరు పెట్ట...