భారతదేశం, డిసెంబర్ 18 -- 'మాస్టర్ మహేంద్రన్'.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేశాడు. పెద్దరాయుడు, దేవి, సింహరాశి, సింహాద్రి.. లాంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. అన్ని బాషలలో కలిపి 200లకు పైగా సినిమాలు చేసాడు.

అయితే పెద్ద రాయుడు చిత్రంతో అందరి గుండెల్లో నిలిచాడు మాస్టర్ మహేంద్రన్. 'నేను చూసాను తాతయ్య' అంటూ 'పాపారాయుడు' రజినీకాంత్ గారికి విషయం చెప్పి పెద్దరాయుడు సినిమానే మలుపు తిప్పిన పిల్లాడిగా మహేంద్ర అందరికి గుర్తిండిపోతాడు.

అలా ఆకట్టుకున్న ఆ పిల్లాడు కాస్తా ఇప్పుడు హీరో అయ్యాడు. మహేంద్రన్ హీరోగా నటించిన కొత్త సినిమా 'నీలకంఠ'. విలేజ్ యాక్షన్ లవ్ స్టోరీగా తెరకెక్కన నీలకంఠ సినిమా వచ్చే ఏడాది జనవరి 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. నీలకంఠ సినిమాకు రాకేష్ మాధవన్ దర్శకత్వం వహించారు.

నీలకంఠ సినిమాలో యష్నా చౌదరి, నేహా పఠాన్ ఇద్దరు హీరోయ...