భారతదేశం, డిసెంబర్ 25 -- వరుస ఫ్లాప్ ల తర్వాత కాస్త రూట్ మార్చి డిఫరెంట్ కాన్సెప్ట్ తో మూవీ చేశాడు రామ్ పోతినేని. అదే 'ఆంధ్రా కింగ్ తాలూకా' సినిమా. ఈ చిత్రంలో ఓ హీరో అంటే పిచ్చి అభిమానమున్న ఫ్యాన్ గా నటించాడు రామ్. ఈ మూవీ ఇవాళ (డిసెంబర్ 25) ఓటీటీలోకి వచ్చేసింది. ఇందులో రామ్, భాగ్యశ్రీ బోర్సే కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది.

రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచే డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది అడుగుపెట్టింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆంధ్రా కింగ్ తాలూకా ఓటీటీలో అందుబాటులో ఉంది.

ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాకు థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రతి హీరో ఫ్యాన్ చూడాల్సిన సినిమా అని రివ్యూలు చెప్పాయి. కానీ ...