భారతదేశం, నవంబర్ 11 -- విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైరెక్టర్ సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు.

రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సంతాన ప్రాప్తిరస్తు మూవీ హైలెట్స్ తెలిపారు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి.

-నేను, డైరెక్టర్ సంజీవ్ రెడ్డి పదేళ్లుగా కలిసి జర్నీ చేస్తున్నాం. నేను నిర్మించిన "లేడీస్ అండ్ జెంటిల్ మేన్" మూవీకి రైటర్‌గా పనిచేశాడు. ఆ సినిమాకు అప్పటి ఏపీ ప్రభుత్వ నంది పురస్కారాల్లో తృతీయ ఉత్తమ చిత్రంతో పాటు బెస్ట్ ఎడి...