భారతదేశం, మే 23 -- టెస్టు క్రికెట్లో తిరుగులేని ఫామ్ లో ఉన్న ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ మరో చరిత్ర నెలకొల్పాడు. తిరుగులేని రికార్డు నమోదు చేశాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు మైలురాయి చేరుకున్న ఆటగాడిగా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. జోష్ మీద ఉన్న రూట్ ఇదే స్పీడ్ తో సచిన్ ఆల్ టైమ్ రికార్డునూ అందుకునే అవకాశముంది.

గురువారం (మే 22) జింబాబ్వేతో తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో జో రూట్ 34 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. టెస్టుల్లో తన 153 మ్యాచ్ లో రూట్ 13 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఫార్మాట్లో అత్యంత వేగంగా 13 వేల రన్స్ కంప్లీట్ చేసిన ప్లేయర్ గా రూట్ నిలిచాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (159 మ్యాచ్ లు) రికార్డును బద్...