Hyderabad, ఏప్రిల్ 17 -- హిమోఫిలియా అనేది జన్యు పరివర్తన వల్ల కలిగే అరుదైన రుగ్మత. ఇది రక్తం గడ్డకట్టే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జన్మించిన ప్రతి 5,000 మంది పురుషులలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 17న వరల్డ్ హిమోఫిలియా డే ను నిర్వహిస్తారు.

హిమోఫిలియా అనేది వారసత్వంగా వచ్చే వ్యాధి. ఈ ఆరోగ్య రుగ్మత తల్లి నుండి వారసత్వంగా వస్తుంది. వారు హిమోఫిలియా జన్యువును తమ కుమారుడికి పంపవచ్చు. హిమోఫిలియా అనేది తీవ్రమైన రక్తస్రావం జరిగేలా చేసే వ్యాధి. ఇది ఎక్కువగా మగవారినే ప్రభావితం చేస్తుంది.

రక్తం గడ్డకట్టడానికి అవసరమైన కారకాల లోపం వల్ల లేదా ఆ కారకాలు పూర్తిగా లేకపోవడం వల్ల హిమోఫిలియా వచ్చే అవకాశం ఉంది. హిమోఫిలియాను రెండు రకాలుగా వర్గీకరించారు. అవి హిమోఫిలియా ఎ, హిమోఫి...