Hyderabad, అక్టోబర్ 9 -- తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్నో సంవత్సరాలుగా షూటింగ్‌ల నుండి విరామం తీసుకున్నప్పుడల్లా హిమాలయాల్లో సమయం గడుపుతుంటాడు. తాను ఎంత ఆధ్యాత్మికవాదినో, అక్కడికి వెళ్లడం వల్ల తన మనస్సు ఎంత ప్రశాంతమవుతుందో అతడు అనేక ఇంటర్వ్యూలలో చెప్పాడు. ఇప్పుడు అతడు వార్షిక హిమాలయాల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. వాటిలో అతడు ధ్యానం చేస్తూ, అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తున్నాడు.

ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న ఫోటోలలో రజనీకాంత్ ముదురు రంగు జంపర్, తెలుపు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఒక ఫొటోలో అతడు కళ్ళు మూసుకుని, మహా అవతార్ బాబాజీ గుహ లోపల లోతైన ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. మరొక ఫొటలో అతడు చేతిలో కర్ర పట్టుకుని, మెట్లపై కూర్చుని ఫొటోకు పోజిచ్చాడు.

సాంప్రదాయ తెల్లటి దుస్తులు ధరించిన రజనీకాంత్.. శ్రీ బాబాజ...