భారతదేశం, జూలై 20 -- మహాభారత కథను మీరు విని ఉండవచ్చు. ద్రౌపదిని ఐదుగురు వివాహం చేసుకున్నారు. ఇలాంటివి ఇప్పటికీ చాలానే జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో బహుభార్యత్వం ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ సంప్రదాయం హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో కూడా పాటిస్తారు. ఒక కుటుంబంలోని సోదరులకు ఒకే భార్య ఉంటుంది. జోడీదారా సంప్రదాయంలో భాగంగా దీనిని పాటిస్తారు.

ఓ వైపు ఆధునికతకు అలవాటు పడినా.. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కొనసాగుతోంది. సిర్మౌర్‌లోని షిల్లై గ్రామంలో ఇద్దరు సోదరులు ఒకే వధువును వివాహం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంప్రదాయాన్ని బహుభార్యత్వం అంటారు.

షిల్లై గ్రామంలోని హట్టీ తెగకు చెందిన ఇద్దరు సోదరులు.. సమీపంలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతను వివాహం చేసుకున్నారు. వధువు సునీతా మాట్లాడుతూ.. తాను ఎటువంటి ఒత్తిడి లేకుండ...