భారతదేశం, నవంబర్ 18 -- ఓ వైపు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లాతోపాటుగా విజయవాడ, కాకినాడ, ఏలూరు ప్రాంతాల్లో మావోల కదలికలను గుర్తించి వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది ఉన్నారేమో అనే అనుమానంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

విజయవాడలో మావోయిస్టులు ఉన్నారనే విషయం తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే కూలీలుగా చెప్పుకొని వారు అద్దెకు ఉంటున్నట్టుగా తెలిసింది. పెనమలూరులో భవనం అద్దెకు తీసుకున్నారని సమాచారం. షెల్టర్ జోన్‌గా మార్చుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ కగార్‌లో భాగంగా అడవుల్లో ఉన్న మావోయిస్టులపై బలగాలు దాడి చేస్తున్నాయి. దీంతో సిటీలో ఉంటూ మావోలు సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు కానూరు కొత్త ఆటోనగర్‌లో గ్రేహౌండ్స్, ఆక్టోపస్ బృందాలు, జిల్లా పోలీసుల త...