Hyderabad, ఏప్రిల్ 30 -- నాని, శ్రీనిధి శెట్టి నటించిన మూవీ హిట్: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా గురువారం (మే 1) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హిట్: ది ఫస్ట్ కేస్, హిట్: ది సెకండ్ కేస్ ఇప్పటికే సూపర్ హిట్ అవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్న నిర్మాతల అభ్యర్థనకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

హిట్ 3 మూవీ టికెట్ల ధరలు పెంచడానికి అనుమతిస్తూ బుధవారం (ఏప్రిల్ 30) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ లో గరిష్ఠంగా రూ.50, మల్టీప్లెక్స్‌లో గరిష్ఠంగా రూ.75 పెంచుకోవచ్చు. జీఎస్టీతో కలిపి ఈ మొత్తం పెంచడానికి అనుమతించారు.

పెంచిన ధరలు ఏడు రోజుల పాటు అమల్లో ఉంటాయి. హిట్ 3 నిర్మాతల అభ్యర్థన మేరకు ధరల పెంపునకు అనుమతించి...