భారతదేశం, మే 1 -- టాలీవుడ్‌లో కొత్త‌ద‌నానికి, వైవిధ్య‌త‌కు మారుపేరుగా హీరో నాని సినిమాలు నిలుస్తుంటాయి. ఇమేజ్ ఛ‌ట్రంలో బంధీ కాకుండా ప్ర‌తి సినిమాలో హీరోగా త‌న‌ను తాను కొత్త పంథాలో ఆవిష్క‌రించుకుంటుంటారు. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా కంప్లీట్ యాక్ష‌న్ క‌థ‌తో నాని చేసిన తాజా మూవీ హిట్ 3.

హిట్ ఫ్రాంచైజ్‌లో మూడో మూవీగా వ‌చ్చిన ఈ సినిమాకు శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా న‌టించింది. మే 1న (నేడు) థియేట‌ర్ల‌లో రిలీజైన‌ హిట్ 3 ఎలా ఉంది? యాక్ష‌న్ క‌థ‌తో నాని ఆడియెన్స్‌ను మెప్పించాడా? లేదా? అంటే?

అర్జున్ స‌ర్కార్ (నాని) ఓ పోలీస్ ఆఫీస‌ర్‌. నిజాయితీతో పాటు కోపం ఎక్కువే. సొసైటీలో క్రిమిన‌ల్ అనే వాడు క‌నిపించ‌కూడ‌దు అన్న‌ది అత‌డి సిద్ధాంతం. అర్జున్ స‌ర్కార్‌కు దొరికితే క్రిమిన‌ల్స్‌కు న‌ర‌క‌మే.

క్రూరంగా హింసిస్తూ వా...