భారతదేశం, ఏప్రిల్ 28 -- నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 చిత్రంపై హైప్ ఓ రేంజ్‍లో ఉంది. సూపర్ సక్సెస్ అయిన హిట్ ఫ్రాంచైజీలో మూడో మూవీగా ఇది తెరకెక్కింది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రంలో నాని వైలెంట్ మోడ్‍లో కనిపించనున్నారు. ట్రైలర్ ద్వారా మరింత హైప్ పెరిగింది. మే 1వ తేదీన హిట్ 3 విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. హిట్ 3 గురించి తన రివ్యూను ఈ ఈవెంట్‌లో చెప్పారు యంగ్ హీరో అడివి శేష్.

హిట్ 3 చివరి 30 నిమిషాలు తాను చూశానని, స్టన్నింగ్‍గా ఉందని అడివి శేష్ అన్నారు. చాలా సర్‌ప్రైజ్‍లు కూడా ఉంటాయని చెప్పారు. "హిట్ 3 లాస్ట్ 30 నిమిషాలు చూశా. మూమూలుగా ఉండదు. బీభత్సం, క్రేజీగా ఉంది. మీకు తెలియని చాలా సర్‌ప్రైజ్‍లు సినిమాలో ఉన్నాయి. చాలా ఎగ్జైటెడ్‍గా ఉన్నా" అని శేష్ తన రివ్యూ చెప్పారు.

ఈ ఫ్రాం...