భారతదేశం, ఏప్రిల్ 29 -- బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్‌లో మినిమం గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు నాని. హాయ్ నాన్న‌, స‌రిపోదా శ‌నివారం బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నాని హీరోగా న‌టిస్తోన్న హిట్ 3పై భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. నాని కెరీర్‌లోనే మోస్ట్ వ‌య‌లెంట్ మూవీగా హిట్ 3 ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ఇటీవ‌ల రిలీజైన టీజ‌ర్‌, ట్రైల‌ర్ సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను అమాంతం పెంచేశాయి. హిట్ 3 ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జ‌రిగిన‌ట్లు స‌మాచారం. యాభై కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో హిట్ 3 రిలీజ్ అవుతోన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. ఆంధ్రా ఏరియాలో 15 కోట్లు, నైజాంలో 13 కోట్ల వ‌ర‌కు నాని మూవీ థియేట్రిక‌ల్ బిజినెస్ జరిగిన‌ట్లు స‌మాచారం.

ఓవ‌ర్‌సీస్‌లో 10 కోట్లు, సీడెడ్‌తో పాటు ఇత‌ర రాష్ట్రాల్లో క‌లిపి మ‌రో 11 కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ ...