భారతదేశం, మే 18 -- నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హిట్ 3 చిత్రం మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ తెలుగు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మంచి హిట్ అయింది. స్టార్ హీరో సూర్య నటించిన యాక్షన్ మూవీ 'రెట్రో' కూడా మే 1వ తేదీన థియేటర్లలో రిలీజైంది. మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లు సాధించింది. కాగా, ఒకే రోజు థియేటర్లలోకి వచ్చిన ఈ రెండు సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ సొంతం చేసుకుంది. దీంతో స్ట్రీమింగ్‍పై క్యూరియాసిటీ నెలకొంది.

హిట్ 3, రెట్రో సినిమాలను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఒకే వారం తీసుకొని రాకపోవచ్చు. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్‍కు తెచ్చేలా నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుంది. దీంతో ఈ రెండు సినిమాల్లో దేన్ని ముందు స్ట్రీమింగ్‍‌కు తీసుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

జూన్ 5వ తేదీన రెట్ర...