భారతదేశం, మే 3 -- నాని కొత్త సినిమా 'హిట్ 3' కలెక్షన్లు రెండో రోజు తగ్గాయి. శుక్రవారం (మే 2) ఈ మూవీ కలెక్షన్లు తక్కువగానే ఉన్నాయి. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం రెండో రోజు రూ.10 కోట్ల నెట్ వసూలు చేసినట్లు సక్నిల్క్.కామ్ వెల్లడించింది. నాని నటించిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ గురువారం (మే 1) థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే.

నాని లేటెస్ట్ మూవీ 'హిట్ 3' రెండు రోజుల్లో కలిపి ఇండియాలో రూ.31 కోట్ల నెట్ వసూలు చేసింది. ఈ చిత్రం మొదటి రోజు రూ.21 కోట్లు రాబట్టింది. తెలుగులో రూ.20.25 కోట్లు; తమిళంలో రూ.35 లక్షలు; కన్నడలో రూ.5 లక్షలు; హిందీలో రూ.25 లక్షలు; మలయాళంలో రూ.లక్ష వసూలు చేసింది. రెండవ రోజు ఇండియాలో రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దీంతో రెండు రోజుల కలెక్షన్స్ రూ.31 కోట్లకు చేరింది. వీకెండ్ కాబట్టి శని, ఆదివారాల్లో నా...