భారతదేశం, అక్టోబర్ 29 -- అంతర్జాతీయ క్రికెట్‌లో తన భవిష్యత్తుపై ఊహాగానాలు పెరుగుతున్న నేపథ్యంలో భారత వెటరన్ ఓపెనర్ రోహిత్ శర్మ తన కెరీర్‌లో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించాడు. తన కెరీర్‌లో తొలిసారిగా ఐసీసీ పురుషుల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో నిరాశపరిచిన ప్రస్తుత భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను వెనక్కి నెట్టి రోహిత్ ఈ స్థానాన్ని దక్కించుకున్నాడు.

38 సంవత్సరాల 182 రోజుల వయసులో ఐసీసీ పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్న రోహిత్ శర్మ.. ఏదైనా ఫార్మాట్ లో టాప్ ప్లేస్ దక్కించుకున్న అత్యంత పెద్ద వయస్కుడైన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో 2011లో 38 సంవత్సరాల 73 రోజుల వయసులో టెస్టుల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ ప్రపంచ రికార్డును బ్రేక్ ...