భారతదేశం, జనవరి 19 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డిపై సుమోటో కేసులు నమోదు చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం బహిరంగ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హింస, రాజకీయ విద్వేషాలు పెంచేలా ఉన్నాయన్నారు. వ్యాఖ్యలు ప్రచారం చేసిన సోషల్ మీడియా, మీడియా సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం వ్యాఖ్యలపై డీజీపీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.. ముఖ్యమంత్రికి ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు.

ముఖ్యమంత్రి హోదాలో ఉండి పాతిపెట్టండి, బొంద పెట్టండి, దిమ్మలు కూల్చండి వంటి హింసాత్మక పదజాలం వాడటం చూస్తుంటే మీరు ముఖ్యమంత్రిలా కాకుండా ఒక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిలా కనిపిస్తున్నారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. ...