భారతదేశం, డిసెంబర్ 31 -- హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై రెండో చోట్ల కేసులు నమోదు అయ్యాయి. హిందూ దేవతలుగా పూజించే సీతాదేవి, ద్రౌపదీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు మేరకు నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్‌ను నడిపిస్తున్న యూట్యూబర్ అన్వేష్‌పై ఖమ్మం అర్బన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దానవాయిగూడెం గ్రామానికి చెందిన సత్యనారాయణరావు అతడిపై ఫిర్యాదు చేశారు.

విశాఖపట్టణానికి చెందిన యూట్యూబర్ అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా.. హిందూవులు పూజించే సీతాదేవి, ద్రౌపదీలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్టుగా ఇన్‌స్పెక్టర్ భానుప్రకాశ్ వెల్లడించారు. ఇక తెలుగు నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో...