భారతదేశం, జనవరి 19 -- ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం వేదాంత గ్రూపునకు చెందిన 'హిందుస్థాన్ జింక్' ఆర్థిక ఫలితాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. సోమవారం (జనవరి 19) విడుదల చేసిన అక్టోబర్-డిసెంబర్ త్రైమాసిక (క్యూ3) గణాంకాల్లో కంపెనీ అదరగొట్టింది. అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు అమాంతం పెరగడం, నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరచడంతో సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా భారీ ఆదాయం, రికార్డు స్థాయి లాభాలను తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) మూడో త్రైమాసికంలో హిందుస్థాన్ జింక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) ఏకంగా 46.22 శాతం వృద్ధి చెంది రూ.3,916 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీ లాభం రూ.2,678 కోట్లుగా మాత్రమే ఉంది. కంపెనీ ఆదాయం, ఎబిటా (EBITDA) రికార్డు స్థాయిలో పెరగడమే ఈ చారిత్రాత్మక లాభాలకు ప్రధాన కారణమని మార్కెట...