భారతదేశం, నవంబర్ 8 -- ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ ది బెంగాల్ ఫైల్స్ రాబోతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యాక సంచలనం క్రియేట్ చేసింది. బెంగాల్ విభజన నాటి హిందువుల ఊచకోత నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. థియేటర్లలో ఓ మోస్తారుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రిలీజ్ కానుంది. ఈ నెలలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది.

బెంగాల్ విభజన నాటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా తెరకెక్కిన 'ది బెంగాల్ ఫైల్స్' మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఈ సినిమా నవంబర్ 21 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఇవాళ (నవంబర్ 8) అనౌన్స్ చేసింది.

''అటెన్షన్ డిమాండ్ చేసిన స్టోరీ ఇది. బెంగాల్ బోల్డెస్ట్ చాప్టర్ ను విట్నెస్ చేసేందుకు రెడీగా ఉండండి. ది బెంగాల్ ఫైల్స్ జీ5లో నవంబర్ 21న ప్రీమియర్ కానుంది'' అని జీ5 ఎక్స...