భారతదేశం, డిసెంబర్ 27 -- బంగ్లాదేశ్ లోని మైమెన్‌సింగ్‌లో రీసెంట్ గా దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని మూకదాడిలో దారుణంగా చంపేసిన ఘటన ఇప్పుడు మన దేశంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ అమానుషమైన చర్యపై స్టార్ హీరోయిన్లు కాజల్ అగర్వాల్, జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ లో మూకదాడిపై ఇండియాలో సెలబ్రిటీలు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఈ మధ్యే జాన్వీ కపూర్ దీనిపై మాట్లాడగా.. తాజాగా కాజల్ అగర్వాల్ కూడా ఓ పోస్ట్ చేసింది. "హిందువులారా మేల్కోండి" అంటూ కాజల్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సీరియస్ మెసేజ్ పోస్ట్ చేసింది.

మంటల్లో కాలుతున్న ఒక వ్యక్తి బొమ్మతో ఉన్న పోస్టర్ ని షేర్ చేస్తూ.. "హిందువులారా మేల్కోండి! మీ మౌనం మిమ్మల్ని కాపాడదు" అని ఘాటుగా రాసుకొచ్చింది. బంగ్లాదేశ్ లోని హిందువుల రక్షణ కోసం అందరూ గొంతు...