భారతదేశం, ఏప్రిల్ 29 -- మతం పేరుతో 26 మందిని చంపితే.. కొందరు భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌ని ప్రేమిస్తున్నారని.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ పై అంత ప్రేమ ఉంటే భారత్ లో ఎందుకు ఉండడం? అని ప్రశ్నించారు. మతం అడిగి మరీ చంపారని మృతుల కుటుంబ సభ్యులు చెబుతుంటే.. మతం అడిగి చంపలేదని సెక్యులర్ వాదులు అంటున్నారని ఫైర్ అయ్యారు. పాక్ ని అంత ప్రేమించే వాళ్లు దయచేసి ఇండియా నుంచి వెళ్లిపోండి.. అని వ్యాఖ్యానించారు.

'నేను జాతీయ సమస్యల గురించి మాట్లాడితే.. అవన్ని నీకెందుకు అని చాలామంది నవ్వారు. ఎక్కడో ఏదో జరిగితే మనకు ఎందుకులే అని చాలా మంది అనుకుంటారు. కానీ దేశ సరిహద్దుల భద్రత సరిగ్గా లేకపోతే.. వాటి ప్రకంపనలు ఎక్కడికైనా వెళ్తాయి. అందుకే నేను దేశం కోసం, దేశ భద్రత కోసం ఇంత తపన పడతాను' అని పవన్ కళ్యాణ్ వివరించారు. పహల్గాం మృతులకు నివాళి...