భారతదేశం, జూన్ 14 -- థియేటర్లలో రికార్డులు ఊచకోత కోసి.. ఓటీటీలోని వరల్డ్ వైడ్ గా దుమ్మురేపిన పుష్ప 2 మూవీ.. టెలివిజన్ ప్రీమియర్ లోనూ అదరగొట్టింది. తెలుగులో స్టార్ మాలో ప్రీమియర్ అయిన ఈ సినిమా రికార్డు టీవీ రేటింగ్ ను సాధించగా.. ఇప్పుడు హిందీ ప్రీమియర్ లోనూ హిస్టరీ క్రియేట్ చేసింది. పుష్ప ది రూల్ మేనియా హిందీలోనూ సాగుతోంది అనేందుకు ఈ టీఆర్పీ రికార్డులే నిదర్శనం.

పుష్ప 2 ది రూల్ మూవీ హిందీ ప్రీమియర్ లో సత్తాచాటింది. టీవీ టెలికాస్ట్ లో అదరగొట్టింది. మే 31న జీ సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా హిందీలో టీవీలోకి వచ్చింది పుష్ఫ 2. తాజా బార్క్ గణాంకాల ప్రకారం టీవీ ప్రీమియర్ లో హిందీలోనూ పుష్ప 2 సంచలనం నమోదు చేసింది. 5.1 టీవీ రేటింగ్ సాధించింది. 5.4 కోట్ల మంది ఈ మూవీని హిందీలో చూశారు.

పుష్పరాజ్ గా అల్లు అర్జున్ మేనియాకు ఇది మరో నిదర్శనం. ఈ విషయాన్ని పు...