భారతదేశం, మే 1 -- టాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్ అల వైకుంఠ‌పుర‌ములో, విరూపాక్ష హిందీలో రిలీజ‌య్యాయి. గురువారం ఈ రెండు సినిమాల హిందీ వెర్ష‌న్స్‌ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఈ విష‌యాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. అల వైకుంఠ‌పుర‌ములో, విరూపాక్ష తెలుగు వెర్ష‌న్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్నాయి.

త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అల వైకుంఠ‌పుర‌ములో అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్‌లో ఒక‌టిగా నిలిచింది. యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ 280 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో సుశాంత్‌, నివేథా పేతురాజ్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

తెలుగు ఇండ‌స్ట్రీలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా ఆ టైమ్ అప్ప‌ట్లో అల వైకుంఠ‌పుర‌ములో ర...