భారతదేశం, జూలై 22 -- ఎవరికైనా వయసు పెరుగుతుంటే అందం తగ్గడం కామనే. అందుకే హీరోయిన్లు వయసులో ఉన్నప్పుడే చేతి నిండా సినిమాలు చేసేస్తారు. వయసు పెరిగిన భామలకు ఛాన్స్ లు తగ్గిపోతాయి. కానీ కొంతమంది ఎంత వయసు వచ్చినా తరగని అందంతో అదరగొడతారు. హాలీవుడ్ హాట్ బ్యూటీ ఏంజెలీనా జోలీ కూడా అలాంటిదే. 50 ఏళ్ల వయసులోనూ ఆమె అందంతో ఆకట్టుకుంటోంది. అయితే రాబోయే పదేళ్ల పాటు కూడా ఇలాగే ఉండాలని ఏంజెలీనా ట్రీట్మెంట్ తీసుకుందనే వార్త సంచలనంగా మారింది.

ఇటీవల 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎడింగ్టన్ సినిమా ప్రీమియర్ సందర్భంగా 50 ఏళ్ల ఏంజెలీనా జోలీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఇన్ టచ్ వీక్లీలో వచ్చిన ఒక నివేదిక ప్రకారం.. ఈ హాట్ బ్యూటీ తన గ్లామర్ కు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. అందుకే తీవ్రమైన లేజర్ చికిత్సలు చేయించుకుంది....