Hyderabad, సెప్టెంబర్ 12 -- సూపర్ హీరో మూవీ మిరాయ్ ఈరోజు అంటే సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. తేజ సజ్జా నటించిన రెండో సూపర్ హీరో సినిమా ఇది. దీనికి సాధారణ ప్రేక్షకులతోపాటు రామ్‌గోపాల్ వర్మలాంటి సెలబ్రిటీలు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విమర్శకుల నుంచి అద్భుతమైన రివ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా బాగా ఆడుతుందని అంటున్నారు. అయితే ఆర్జీవీ ఈ మూవీ గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

మిరాయ్ మూవీ థియేటర్లలోకి వచ్చిన కొద్దిసేపటికే రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇందులో ఈ సినిమాను ఇండస్ట్రీ హిట్ గా అభివర్ణించాడు. "ఒక ఇండస్ట్రీ హిట్ ఇచ్చినందుకు తేజ సజ్జా, కార్తిక్ ఘట్టమనేని, విశ్వప్రసాద్ టి.జి. లకు నా అభినందనలు. 'బాహుబలి' తర్వాత ఏ సినిమాకి కూడా ఇంతటి ప్రశంసలు నేను వినలేదు. 'మిరాయ్'.. ఈ సినిమాలో వీఎఫ్‌ఎక్స్, కథ రెండూ...