Hyderabad, సెప్టెంబర్ 30 -- మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ ఓజీ మూవీ చూసి రివ్యూ ఇచ్చాడు. మంగళవారం (సెప్టెంబర్ 30) ఉదయం ఎక్స్ వేదికగా అతడు సినిమాపై స్పందించాడు. ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమా చూశామని, పవన్ కల్యాణ్ స్వాగ్ సినిమాను నిలబెట్టిందని అతడు అనడం విశేషం. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా 'దే కాల్ హిమ్ ఓజీ' సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ కలెక్షన్లతో మొదలైనా, తర్వాతి రోజుల్లో కొంచెం స్లో అయింది.

ఓజీ మూవీపై ఇప్పటికే ఎన్నో రివ్యూలు వచ్చాయి. అయితే అందరూ చిరంజీవి రివ్యూ కోసం ఎదురు చూశారు. మొత్తానికి మంగళవారం (సెప్టెంబర్ 30) మెగాస్టార్ ఎక్స్ లో 'దే కాల్ హిమ్ ఓజీ' గురించి తన ఆలోచనలను పంచుకున్నాడు.

"మా ఫ్యామిలీ అందరితో కలిసి #TheyCallHimOG చూశాను. ప్రతి బిట్‌ను పూర్తిగా ఎంజాయ...