Hyderabad, అక్టోబర్ 5 -- ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో హాలీవుడ్‌లో డైరెక్ట్‌గా నిర్మిస్తున్న సినిమా 'కింగ్ బుద్ధ'. తాజాగా కింగ్ బుద్ధ పోస్టర్ లాంచ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్‌గా జరిగింది.

మూవీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ సత్యారెడ్డి అభిమానులు, చిత్ర యూనిట్ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఆకట్టుకుంది. ఈ ఈవెంట్‌కు మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్‌గా పనిచేసిన మ్యాట్ పోవెల్ చీఫ్ గెస్ట్‌గా హాజరై 'కింగ్ బుద్ధ' పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మ్యాట్ పోవెల్.. "గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం అమితమైన కృషి చేశారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్, నా స్నేహితుడైన సత్యారెడ్డి ఈ సినిమాను టాలీవుడ్ లేదా బాలీవుడ్‌లో తీసి హాలీవుడ్‌లో డబ్బింగ్ చేయకుండా, డైరెక్ట్‌గా హాలీవుడ్‌లో...