భారతదేశం, మే 17 -- న‌టి సురేఖ‌వాణి కూతురు సుప్రిత ఓ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోంది. అమ‌రావ‌తికి ఆహ్వానం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో సుప్రిత‌తో పాటు ఎస్త‌ర్‌, ధ‌న్య‌బాల‌కృష్ణ హీరోయిన్లుగా క‌నిపించ‌బోతున్నారు. శివ కంఠంనేని హీరోగా న‌టిస్తున్నాడు. ఈ మూవీకి జీవీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

అమ‌రావ‌తికి ఆహ్వానం లేటెస్ట్ షెడ్యూల్ మ‌ధ్య ప్ర‌దేశ్ లో కంప్లీట్ చేశారు. మ‌ధ్య ప్రదేశ్‌లోని చింద్వార స‌మీపంలో ఉన్న తామ్య హిల్స్‌, పాతాళ్ కోట్‌, బిజోరి, చిమ్‌తీపూర్ వంటి ప‌లు అంద‌మైన లొకేష‌న్స్‌లో దాదాపు 20 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. ఈ షెడ్యూల్ కంటే ముందు ఏపీ, తెలంగాణ‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కించిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

హీరో శివ కంఠంనేని మాట్లాడుతూ - "అమ‌రావ‌తికి ఆహ్వానం టైటిల్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ప్ర‌జెంట్ ట్ర...